కళ్యాణదుర్గం: వడ్డేపాల్యం గ్రామంలో భక్తి శ్రద్ధలతో ఆవుల జాతర

74చూసినవారు
కుందుర్పి మండలం వడ్డే పాల్యం గ్రామంలో సోమవారం ఆవుల జాతరను గ్రామస్థులు, రైతులు అత్యంత ఘనంగా నిర్వహించారు. వడ్డే పాల్యం గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల 10 గ్రామాలకు చెందిన రైతులు తాము పెంచుకుంటున్న ఆవులను జాతరకు తీసుకొచ్చారు. అగ్నిగుండం చుట్టూ మూడు సార్లు ఆవులను ప్రదక్షిణ చేయించారు. ఇలా చేస్తే ఆవులకు ఎలాంటి రోగాలు రావని రైతులు నమ్ముతారు. కొన్నేళ్లుగా ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్