శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ పట్టణ సమీపంలోని మడకశిర వెళ్లే రహదారిలోని జర్నలిస్ట్ కాలనీకి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయిస్తున్నారు. బుధవారం పెనుకొండ గొర్రెల పెంపకం క్షేత్రం సమీపంలో నుండి పట్టణానికి వస్తున్న పైప్ లైన్ ద్వారా నీటి సౌకర్యం కోసం పనులు చేపట్టారు. నీటి సౌకర్యం త్వరలో ఏర్పాటు కావడంతో మంత్రి సవితకు జర్నలిస్టు కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపారు.