గోరంట్ల మండలం పాలసముద్రం రహదారిపై మోకాలిలోతు గుంతల్లో వర్షం నీరు నిల్వ ఉండటంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. శనివారం రహదారిపై గుంతల్లో వర్షపు నీరు పెద్ద ఎత్తున నిలువ ఉండటంతో నీటి కుంటను తలపిస్తున్నాయి. కదిరి-హిందూపురం రహదారిలో పాలసముద్రం వద్ద రోడ్డు దుస్థితి అధ్వానంగా మారింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డును బాగు చేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.