పరిగి మండలం కొడిగెనహళ్లి గ్రామంలో మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ శనివారం పర్యటించారు. ఈ సందర్బంగా గుడ్ మార్నింగ్ అంటూ ప్రజలతో మమేకమై కాఫీ త్రాగుతూ ప్రజలందరినీ పలకరించి వారి సమస్యలను ఉషాశ్రీచరణ్ అడిగితెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పరిగి మండల కన్వీనర్ కురుబ నరసింహమూర్తి, మండలంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.