పెనుకొండ పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయంలో బుధవారం చికెన్ షాప్ యాజమానులతో కమీషనర్ శ్రీనివాసులు అద్వర్యంలో సమావేశం నిర్వహించారు. కమీషనర్ మాట్లాడుతూ చికెన్ షాప్ యాజమానుదారులకు ప్రజారోగ్యం దృష్ట్యా చికెన్ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాలలో పార వేయరాదని తెలిపారు. ప్రతి షాప్ ప్రజారోగ్యంకు అనుగుణంగా నిర్వహణ ఉండాలని, చికెన్ వ్యర్థాలను కేవలం తమకు సంభందించిన వాహనం ద్వారా తొలగించి పట్టణ పరిశుభ్రతకి సహరించాలని తెలిపారు.