సత్యసాయి జిల్లా, పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సమీపంలో వై జంక్షన్ లో ఉన్న ఫ్రూట్స్ మండీ లో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. తాను రూములో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని మండి యాజమాని రఫిక్ తెలిపారు. దాదాపు రెండు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని రఫీ ఆవేదన చెందారు. గురువారం యజమాని మాట్లాడుతూ ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు.