రాజమండ్రి: 'నిర్ణీత సమయంలోపు సమస్యలను పరిష్కరించాలి'
నిర్ణీత సమయంలోపు ప్రజల సమస్యలను అధికారులు పరిష్కరించాలని రాజమండ్రి ఆర్డీవో కృష్ణ నాయక్ సూచించారు. సోమవారం రాజమండ్రిలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. వాటిపై అర్జీలు స్వీకరించారు. భూ సమస్యలు, పెన్షన్లు, సంక్షేమ పథకాలపై ఫిర్యాదులు వచ్చినట్లు ఆయన తెలిపారు.