రాప్తాడు మార్కెట్ లో కిలో టమోటా 60.... రైతుల హర్షం

80చూసినవారు
రాప్తాడు మార్కెట్ లో కిలో టమోటా 60.... రైతుల హర్షం
రాప్తాడు మండలం కక్కలపల్లి మార్కెట్లో కిలో టమాటా గరిష్ఠంగా రూ. 60తో అమ్ముడుపోయినట్లు రాప్తాడు మార్కెట్ యార్డు కార్యదర్శి రాంప్రసాద్ తెలిపారు. మార్కెట్ కు మంగళవారం మొత్తంగా 900 టన్నుల టమాటా దిగుబడులు వచ్చాయని తెలిపారు. కిలో సరాసరి ధర రూ. 45, కనిష్ఠ ధర రూ. 30 పలికినట్లు వెల్లడించారు. ధరలు పెరగడంతో టమాటా రైతులు అనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్