పాఠశాలలో పరిటాల శ్రీరామ్ జన్మదిన వేడుక పాల్గొన్న ఎమ్మెల్యే

67చూసినవారు
పాఠశాలలో పరిటాల శ్రీరామ్ జన్మదిన వేడుక పాల్గొన్న ఎమ్మెల్యే
రామగిరి మండలం గంగంపల్లి సమీపంలోని నసనకోట గురుకుల పాఠశాలలో ఆదివారం పరిటాల శ్రీరామ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన భారీ కేక్ ను ఆమె కట్ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ కు విద్యార్థులు అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామ్ అభిమానులు స్కూల్ కు అవసరమయ్యే వంట సామాగ్రిని విరాళంగా అందించారు.

సంబంధిత పోస్ట్