గుమ్మఘట్ట మండలం సిరిగేదొడ్డిలో సంక్రాంతి పండుగ సందర్భంగా మంగళవారం పొట్టేళ్ల పోటీలు నిర్వహించారు. ముఖ్య అథితిగా రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తనయుడు కాలువ భరత్ హాజరయ్యారు. పోటీలను వీక్షించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిరిగేదొడ్డి సర్పంచ్ రేవన్న, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.