నార్పల: విద్యార్థులు హ్యాండ్ వాష్ తప్పనిసరిగా చేసుకోవాలి

61చూసినవారు
నార్పల: విద్యార్థులు హ్యాండ్ వాష్ తప్పనిసరిగా చేసుకోవాలి
నార్పల మండలం బి. పప్పూరు అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో మంగళవారం వైద్య అధికారులు కాలేజీ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సీజనల్ వ్యాధులైన మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ మొదలగు జ్వరాల వ్యాప్తి గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులకు డాక్టర్ మహేంద్ర నాథ్, వారి వైద్య సిబ్బంది మందులు పంపిణీ చేశారు. విద్యార్థులు తప్పనిసరిగా హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్