అనంతపురం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయానికి బుక్కరాయసముద్రం, తాడిపత్రి, నార్పల నుంచి చెరువు కట్టమీద వెళ్లే రహదారి గుంతలమయంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం నగరానికి ఈ రోడ్డు మార్గాన వాహనదారులు చేరుకుంటారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.