ఆటోను ఢీకొన్న లారీ.. ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలు

83చూసినవారు
ఆటోను ఢీకొన్న లారీ.. ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలు
పెద్దవడుగూరు మండల పరిధిలోని అప్పేచెర్ల గ్రామ సమీపంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దపప్పూరు మండలంలోని అక్షరాల దిన్నె గ్రామానికి చెందిన వెంకట రాముడు పనిమీద ఆటో నడుపుతూ గుత్తికి వెళ్లాడు. గుత్తిలో పని ముగించుకొని తిరిగి అక్షరాల దిన్నెకు వెళుతుండగా, మార్గ మధ్యలో ఆటోకు ఎదురుగా లారీ ఢీకొనింది. స్థానికులు వెంటనే గుత్తి ఆసుపత్రికి తరలించి, అనంతరం అనంతపురం రెఫర్ చేశారు.

సంబంధిత పోస్ట్