యాడికి: తండ్రి హత్య కేసులో నిందితుడి అరెస్టు

66చూసినవారు
తండ్రిని హత్య చేసిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ ఈరన్న శుక్రవారం తెలిపారు. యాడికి మండలం వీరన్నపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణకు ఇద్దరు భార్యలున్నారు. కుటుంబ సభ్యుల నడుమ ఆస్తి పంపకాలకు సంబంధించి వివాదం నడుస్తోంది. పెద్ద భార్య కుమారుడు కార్తిక్ తమకు చెందాల్సిన ఆస్తిని పంచి ఇవ్వకుండా, వ్యసనాలకు ఖర్చు పెడుతుండటాన్ని జీర్ణించుకోలేక పోయాడు. దీంతో తండ్రిని హత్య చేశాడు.

సంబంధిత పోస్ట్