తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, నటి మాధవీలత మధ్య నెలకొన్న వివాదం మరింత ముదురుతోంది. తనను జేసీ పరుష పదజాలంతో దూషించారంటూ తాజాగా సైబరాబాద్ సీపీకి మంగళవారం ఫిర్యాదు చేశారు. జేసీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన మాటలు తనను ఇబ్బందికి గురిచేశాయని చెప్పారు. క్షమాపణ చెప్పానంటే సరిపోతుందా? అని ప్రశ్నించారు. ఇటీవల మా లోనూ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.