తాడిపత్రి పట్టణంలో దేశభక్తిని చాటేందుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహిస్తున్న జనగణమన కోసం 'ఒక్క నిమిషం ఆగుదాం' కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రతిరోజు ఉదయం నిర్వహిస్తుండటంతో తాడిపత్రి ప్రజలే కాకుండా తాడిపత్రి మీదుగా వెళ్లే ప్రతి ఒక్క వాహనదారులు సైతం ఒక్క నిమిషం నిలబడి జనగణమన గీతాన్ని ఆలపిస్తున్నారు. ఈ కార్యక్రమంపై రోటరీ క్లబ్ సభ్యులకు పట్టణ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.