పెద్దవడుగూరు మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లో శనివారం ఎస్ఐ ఆంజనేయులు సిబ్బందితో కలిసి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లోని రౌడీషీటర్లు, ట్రబుల్ మంగర్స్ ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. ఎవరూ గొడవలకు పాల్పడరాదని హెచ్చరించారు. ఏవైనా సమస్యలు వుంటే పోలీసుస్టేషన్ ను సంప్రదించాలన్నారు. ఎక్కడైనా పేకాట, మట్కా వంటివి జరుగుతుంటే 9440796826కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ గ్రామస్తులకు తెలియచేశారు.