పెద్దవడుగూరు: పత్తి పంట వ్యర్థాలను పొలంలో కాల్చకండి

56చూసినవారు
పెద్దవడుగూరు: పత్తి పంట వ్యర్థాలను పొలంలో కాల్చకండి
పత్తి పంట వ్యర్థాలను పొలంలో కాల్చకూడదని వ్యవసాయ శాస్త్రవేత్తలు కిషోర్ రెడ్డి, మల్లీశ్వరిలు రైతులకు సూచించారు. పెద్దవడుగూరులోని రైతు సేవా కేంద్రంలో రైతులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడారు. పత్తి పంట వ్యర్థాలను పొలంలో కాల్చడం వల్ల భూమి సారం కోల్పోతుందన్నారు. తద్వారా పంట దిగుబడులు తగ్గుతాయన్నారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్