తాడిపత్రిలో ఇసుక ట్రాక్టర్ల సీజ్

74చూసినవారు
తాడిపత్రిలో ఇసుక ట్రాక్టర్ల సీజ్
తాడిపత్రి మండలం సజ్జలదిన్నె గ్రామంలోని ఆలూరు క్రాస్ వద్ద శనివారం ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేశామని రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపారు. స్థానిక పెన్నా నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా రన్న సమాచారం తెలియడంతో వెంటనే సిబ్బందితో దాడి చేశామన్నారు. ఇందులో నంద్యాల జిల్లా అవుకు మండలానికి చెందిన డ్రైవర్లు శ్రీనివాసులు, మహేంద్రలను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామని చెప్పారు.

సంబంధిత పోస్ట్