తాడిపత్రి పట్టణంలో ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య పరస్పరం రాళ్లదాడులు జరిగాయి. ఆ సమయంలో ఇరువర్గాల వారు ట్రాక్టర్లతో రాళ్లను మైదానానికి తరలించారు. వాటిని శనివారం మున్సిపల్ సిబ్బంది తీసేశారు. మైదానంలో ఒక్క రాయి లేకుండా చేశారు. ఇరుపార్టీల నాయకుల ఇళ్ల వద్ద రాళ్లు లేకుండా తొలగించారు.