ఎవరైనా మనల్ని అసూయతో లేదా ద్వేషంతో చూసినప్పుడు దిష్టి తగులుతుందని చెబుతుంటారు. ఈ దిష్టి ప్రభావం వల్ల దురదృష్టం వెంటాడుతుందని, అనారోగ్యం పాలవుతారని అనేక మంది విశ్వసిస్తుంటారు. అయితే ఇలా చేస్తే నరదిష్టి తగలకుండా ఉంటుందని జ్యోతిష్యులు పేర్కొంటున్నారు. అవేంటివంటే.. నల్లత్రాడు కట్టుకోవడం, కర్పూరం కాల్చడం, యాలకులను ఇంటి గుమ్మం దగ్గర కాల్చడం, లవంగాలు జేబులో ఉంచుకోవడం ద్వారా దిష్టి తగలకుండా బయటపడొచ్చని వివరిస్తున్నారు.