గత వైసీపీ ప్రభుత్వంలో తప్పుడు కేసులు పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. పామిడి పట్టణంలోని ఓ వస్త్ర దుకాణంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తప్పుడు కేసులు పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు వినతి పత్రాలు అందజేసి అలసిపోయామన్నారు. ఇచ్చిన వినతులు చెత్తబుట్టపాలయ్యాయన్నారు. దీంతో జిల్లా కోర్టులో పిటీషన్ వేశానని తెలిపారు.