ఏపీ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మొదటిసారి ఢిల్లీకి వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ను ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు కృష్ణదేవరాయలు ఉన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలపై నిర్మలా సీతారామన్తో చర్చించామని పయ్యావుల పేర్కొన్నారు.