కూడేరు మండలం జయపురం గ్రామంలో రైతులు భూమి రీ సర్వే సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రీ సర్వే డిప్యూటీ తాసిల్దార్ ప్రసాద్ మాట్లాడుతూ జయపురం గ్రామంలో రెవెన్యూ సిబ్బంది మూడు టీములుగా ఏర్పడి ఒక్కొక్క టీం 20 ఎకరంల వరకు రీ సర్వే ప్రారంభించడం జరిగిందని ఆయన అన్నారు. రి సర్వే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.