సంక్రాంతి వేదికగా పూల అంజినయ్య, సాలమ్మ కుటుంబ సభ్యులు విడపనకల్లు మండలం పొలికి గ్రామంలో బుధవారం జరిగిన సంక్రాంతి సంబరాల్లో ‘పూల’వారి కుటుంబం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెండు దశాబ్దాల తరువాత ఏకంగా 85మంది రక్త సంబంధీకులు సొంతూరిలో పండుగ చేసుకోవడం దీనికి కారణం. పూల అంజినయ్య, సాలమ్మ దంపతుల కుటుంబం ఒక్కసారైనా కలుసుకుంటే బాగుంటుందని ప్రయత్నాలు ప్రారంభించారు. సంక్రాంతి వేదికగా సొంతూరికి తిరిగొచ్చారు.