ఉరవకొండ పట్టణ కేంద్రంలోని ఓ వృద్ధాశ్రమంలో ఆదివారం పండుటాకులకు ఉరవకొండ పట్టణ సీఐ మహానంది అన్నం వడ్డించి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర మాల మహానాడు ఉపాధ్యాయులు మొలక బాల రామాంజనేయులు ఆధ్వర్యంలో ఈ అన్నదాన సేవా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజు, ఓబయ్య, ఎల్లప్ప, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.