వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామ ప్రజలు సీజనల్ వ్యాధులపై అపోహలు వీడాలని ఉరవకొండ మలేరియా సబ్ యూనిట్, అధికారి బత్తుల కోదండరామరెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం కొనకొండ్ల గ్రామంలో సామాజిక ఆరోగ్య కేంద్రం నుంచి 500మంది ప్రజలతో ర్యాలీ చేపట్టారు. కరపత్రాలు పంచుతూ ఆరోగ్య సూచనలు చేశారు. అనంతరం వైసీపీ ఎమ్మెల్సీ శివరామి రెడ్డితో కలిసి ప్రజలకు మందులు పంపిణీ చేశారు.