విడపనకల్లు మండలంలోని పాల్తూరు వద్ద శనివారం డ్రైవింగ్ లో ఉండగా ఒక్కసారి డ్రైవర్ నాగన్నకు ఛాతిలో నొప్పి రావడంతో బస్సును పక్కకు ఆపాడు. హోన్నూర్ నుంచి 40మంది ప్రయాణికులతో ఉరవకొండకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం ప్రమాదం తప్పింది. చికిత్స నిమిత్తం డ్రైవరును ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన డ్రైవర్ కు ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ పూల నాగరాజు అభినందించారు.