ఆమదాలవలస మండలం దూసిపేట గ్రామ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. గురువారం ఆముదాలవలస నియోజకవర్గ దూసిపేటలో మాట్లాడుతూ.. సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాలని ఆదేశించారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సచివాలయ అధికారుల పనితీరు మెరుగుపడాలన్నారు. అనంతరం దూసి గ్రామంలో రూ. 56. 50 లక్షల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.