మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆముదాలవలస ఎంపీడీవో రోణంకి వెంకట్రావు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఆముదాలవలస మండల సమావేశం శనివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి ఎంపీపీ తమ్మినేని శారద అధ్యక్షతన ప్రారంభమవుతుందని, సమావేశానికి ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ హాజరవుతారని, కావున ఈ సమావేశానికి ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు విధిగా హాజరు కావాలని సూచించారు.