ఆమదాలవలస మండలం చింతాడ గ్రామంలో ప్రతి శనివారం సంత నిర్వహించడం జరుగుతుంది. శనివారం జరిగే ఈ సంతలో కూరగాయలు, నిత్యవసర వస్తువులు, పశువుల అమ్మకాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇటీవల కాలంలో వర్షాలు పడడంతో సంతలో రహదారులు బురదమయం కావడంతో సంతకు వచ్చే వినియోగదారులు తీవ్ర ఇబ్బంది గురవుతున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుంటారని కోరుతున్నారు.