కొరపాం గ్రామంలో అయ్యప్ప స్వాములు తిరువిది మహోత్సవం నిర్వహించారు. సోమవారం రాత్రి కొరపాం గ్రామంలో గురు స్వాముల మల్లీశ్వర రావు, శ్రీను స్వామి ఆధ్యర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు శ్రీ స్వామియే శరణమయ్యప్ప అనే నామస్వరణతో గ్రామంలోని విధులు మారుమోగాయి. ఈ కార్యక్రమంలో యువత, గ్రామస్థులు పాల్గొన్నారు.