ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధి పాత ఆముదాలవలసలో శుక్రవారం ప్రధాన మురుగు కాలువల్లో వర్షపు నీరు నిలువ ఉండకుండా పూడికతీత పనులు చేపట్టారు. గతంలో ఎటువంటి పుడికలు తీయకపోవడంతో కాలువలో నీరు, చెత్త నిల్వ ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. కుటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిధులు కేటాయించి పట్టణంలో ప్రధాన రహదారి లో ఉన్న డ్రైనేజ్ లో పూడిక తొలగించి శుభ్రం చేయించడంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.