శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ కు తూర్పు వైపునున్న రైల్వే గేటు (ఊసావానిపేట) రైల్వే గేట్ పడితే ప్రయాణికులకు నరకయాతనని ప్రయాణికులు వాపోతున్నారు. ఆముదాలవలస పట్టణానికి ఆనుకొని ఉన్న నరసన్నపేట వైపు వెళ్లే రహదారిలో ఊసావానిపేట దగ్గర ఉన్న రైల్వే గేటు రైలు వచ్చే సమయంలో సిబ్బంది గేటు వేస్తే పలు ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ మార్గం గుండా రోజుకు 80 రైళ్లు పయనిస్తున్నాయి.