ఆముదలవలస మున్సిపాలిటీ పరిధి మెట్టక్కివలస 9వ వార్డులో బుధవారం కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తైన సందర్భంగా కూటమి నాయకులు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేసి వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం అమలు చేసిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు, పెన్షన్ పెంపు, అన్న క్యాంటీన్, మెగా డీఎస్సీ గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.