గ్రామదేవత పాలపోలమ్మ తల్లి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు సందర్భంగా ప్రత్యేకపూజలు భక్తులు నిర్వహించారు. శుక్రవారం రాత్రి ఆముదాలవలస పట్టణంలోని గ్రామదేవత పాలపోలమ్మతల్లి ఆలయంలో శరన్నవరాత్రులు సందర్భంగా గాయత్రీదేవి అవతారంలో రెండోరోజు ప్రత్యేక పూజలు ప్రసాద్ పంతులు నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు ప్రత్యేకపూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులుఎమ్ రమేష్, కే అప్పలనాయుడు, వేణుగోపాల్, ప్రసాద్ తెలిపారు.