ఆమదాలవలస: ఈనెల 22న మేథ్స్ టాలెంట్ టెస్ట్

56చూసినవారు
ఆమదాలవలస: ఈనెల 22న మేథ్స్ టాలెంట్ టెస్ట్
ఆమదాలవలస పట్టణంలోని ఎస్వీఎస్ పాఠశాలలో ఈనెల 22న శ్రీనివాస రామానుజన్ జన్మదినం సందర్భంగా ఎక్స్ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో 2 నుంచి 10వ తరగతి విద్యార్థులకు మేథ్స్ టేలెంట్ టెస్ట్ ను నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు మండల స్థాయిలో ఈ టాలెంట్ టెస్ట్ ను నిర్వహిస్తున్నారు. అనంతరం మాథ్స్ ఎక్స్ పో ప్రాజెక్టులను విద్యార్థులకు పరిచయం చేయనున్నట్లు పాఠశాల డైరెక్టర్ పేడాడ వెంకట ప్రతాప్ కుమార్ గురువారం తెలిపారు.

సంబంధిత పోస్ట్