శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో వ్యాధులు ప్రబలకుండా ముమ్మరంగా శానిటేషన్ పనులు నిర్వహిస్తున్నట్లు శానిటరీ సెక్రటరీ జె రామశంకర్ తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో కొత్తకోట వారి వీధి, గణేష్ నగర్ లో మంగళవారం చెత్త కుప్పల తొలగింపు, మురుగునీటి కాలువల్లో పూడిక తొలగింపు పనులను సిబ్బంది నిర్వహించినట్లు స్థానిక టీడీపీ నాయకులు తెలిపారు.