చీడివలసలో దొంగలు హల్ చల్

85చూసినవారు
చీడివలసలో దొంగలు హల్ చల్
బూర్జ మండలం చీడివలస గ్రామానికి చెందిన కే అప్పలనాయుడు తన ఇంటిలో దొంగల చొరబడి చోరీ చేసినట్లు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంగళవారం వేకువజామున తన ఇంటి బీరువాలో ఉన్న సుమారు 4. 5 తులాల బంగారము, 15 తులాల వెండి చోరీ కి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సంఘటన స్థలాన్ని క్లూస్ టీం పరిశీలించిందని సి ఐ దివాకర్ యాదవ్, ఎస్సై జీ. వీ ప్రసాద్ పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్