రణస్థలం మండల కేంద్రంలో గురువారం ఉదయం ఎన్టీఆర్ పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్, రాష్ట్ర సర్పంచుల సంఘం ఆర్గనైజింగ్ సెక్రెటరీ పిన్నింటి వెంకట భానోజి నాయుడు లబ్ధిదారులు ఇంటి వద్దకే నేరుగా వెళ్లి పింఛను పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి పేద ప్రజల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో మండల కూటమి నేతలు పాల్గొన్నారు.