ఎచ్చెర్ల మండలం డి. మత్స్యలేశంలోని సముద్ర తీరంలో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన మత్స్యకారుడు కోడ గురుమూర్తి చేపలు పట్టే వలలను గుర్తుతెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. స్థానిక మత్స్యకారులు వేంటనే స్పందించి మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 6 లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నాడు.