లావేరు: హనుమాన్ ఆలయంలో చోరీ

62చూసినవారు
లావేరు: హనుమాన్ ఆలయంలో చోరీ
లావేరు మండలంలోని రావివలసలో జాతీయ రహదారి పక్కన ఉన్న హనుమాన్ ఆలయంలో శనివారం ఆలయ గ్రిల్స్ తాళాలు విరగ్గొట్టి దొంగలు హుండీలో ఉన్న నగదును దోచుకెళ్లారని గ్రామపెద్ద దారపురెడ్డి కూర్మారావు తెలిపారు. హుండీలో గత కొంతకాలంగా భక్తులు వేసే కానుకలు, నగదును దొంగలు దోచుకున్నట్టు తెలిపారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి దొంగతనాలను అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్