ఎచ్చెర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు గురువారం ఉదయం సందర్శించారు. ముందుగా కళాశాల ఆవరణను పరిశీలించారు. ఈ సందర్బంగా కళాశాలలో విద్యార్థులకు అందిస్తున్న మౌలిక సౌకర్యాలపై ఎమ్మెల్యే ఆరా తీశారు. పేద ప్రజల విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని, ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.