ముద్దాడ ప్రాథమిక పాఠశాలలో సంక్రాంతి సంబరాలు

61చూసినవారు
ఎచ్చెర్ల మండలం ముద్దాడ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుల మణిపాత్రుని నాగేశ్వరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు ముగ్గులు పోటీలను నిర్వహించారు. తెలుగువారి పండుగ సంక్రాంతి విశేషాలను విద్యార్థులకు వివరించి.. హరిదాసు వేషాలను విద్యార్థులు అలరించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్