సంతకవిటి మండలం కొత్తూరు రామచంద్రపురం గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా బుధవారం రాత్రి నృత్య ప్రదర్శన నిర్వహించగా.. గ్రామానికి చెందిన చిన్నారి చొక్కర చరిష్మా పలు భక్తి గీతాలకు భరత నాట్యాన్ని ప్రదర్శించింది. లయబద్ధమైన నాట్యంతో అలరిస్తూ వీక్షకుల కరతాళధ్వనులు అందుకుంది. గ్రామ పెద్దలు చరిష్మాను ప్రత్యేకంగా అభినందించారు.