సర్దార్ గౌతు లచ్చన్న జీవితం ఎంతో ఆదర్శమని, అటువంటి మహానుభావుడు మన జిల్లాకు చెందిన వ్యక్తి కావడం మన అందరికీ గర్వకారణమని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన గౌతు లచ్చన్న 115 జయంతి వేడుకలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ముందుగా లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే ఘన నివాళులు అర్పించారు.