మత్తు పదార్థాల జోలికి పోవద్దు

69చూసినవారు
మత్తు పదార్థాల జోలికి పోవద్దు
విద్యార్థులు మత్తు పదార్థాల జోలికి పోవద్దని బారువ ఎఎస్ఐ కె. కృష్ణారావు సూచించారు. సోంపేట మండలంలోని కొర్లాం బాలకృష్ణ జూనియర్ కళాశాలలో బుధవారం విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం, దుష్పరిణామాలు, చట్టం పై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలో ఎటువంటి చెడు వ్యసనాలకు లోను కావద్దన్నారు. మత్తు పదార్థాలు సేవిస్తే అది శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఇబ్బందులు కలగజేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్