ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే

78చూసినవారు
ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే
వర్షాలు, వరదలు నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ తెలిపారు. కంచిలి, సోంపేట, కవిటి తాసిల్దార్ కార్యాలయంలో తుఫాన్ పై సమీక్ష సమావేశంలో సోమవారం పాల్గొన్నారు. అనంతరం ఇద్దువానిపాలెం తీర ప్రాంతాన్ని పరిశీలించి, అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆయనతో పాటు ఆర్ఢీఓ భరత్ నాయక్ , తాసిల్దార్, ఎంపీడీఓ, సీఐ, ఎస్సై, మండల నాయకులు, రైతులు, మత్స్యకారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్