అర్లిలో అగ్నిప్రమాదం.. గడ్డి కుప్పలు దగ్ధం

60చూసినవారు
అర్లిలో అగ్నిప్రమాదం.. గడ్డి కుప్పలు దగ్ధం
సారవకోట మండలం అర్లి గ్రామంలో సోమవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డొక్క దాసుకు చెందిన సుమారు 6 ఎకరాలకు సంబంధించిన రెండు గడ్డి కుప్పలు, ఏడు కొబ్బరి మొక్కలు, రెండు మామిడి చెట్లు దగ్ధమయ్యాయి. పొరుగున ఉన్న రైతు అతని పొలంలోని గడ్డి కాలుస్తుండగా ప్రమాదం జరిగిందని రైతు డొక్క దాసు తెలిపారు. కోటబొమ్మాళి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్