పాలకొండ: జగనన్న కాలనీలో సమస్యల పరిష్కారానికి కృషి చెయ్యండి

75చూసినవారు
పాలకొండ: జగనన్న కాలనీలో సమస్యల పరిష్కారానికి కృషి చెయ్యండి
పాలకొండ నగర పంచాయతీ కార్యాలయంలో సోమవారం టీడీపీ నాయకులు పల్లా కొండబాబు ప్రజా సమస్యలపై వినతులు స్వీకరించారు. నగర శివారులో ప్రభుత్వం పేదలకు కేటాయించిన జగనన్న కాలనీ ఇళ్ల వద్ద మౌలిక సదుపాయాల పరిస్థితిని సీపీఐ నాయకులు బుడితి అప్పలనాయుడు వివరించారు. వీధి దీపాలు ఏర్పాటు, తాగునీటి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తామని సంబంధిత అధికారులతో మాట్లాడి స్పష్టం చేశారు. కాలనీని అభివృద్ధి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్